ఘనంగా బాలల దినోత్సవం
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : భారతదేశం మొదటి ప్రధా ని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మండలంలోని పలు పాఠశాల్లో విద్యార్థులు బాలల దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వయం పరిపా లన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జోహార్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు.అనంతరం పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు గా, విద్యాధికారులుగా, ప్రధానోపాధ్యాయులుగా, పాఠశాల సిబ్బందిగా పాత్రలు వేసి రోజంతా స్వయం పరిపాలన పాటిం చారు. ఈ స్వయం పరిపాలన కార్యక్రమం తాడ్వాయి, కాటా పూర్, మేడారం, ఊరట్టం ఆశ్రమ పాఠశాలల్లో, జడ్.పి.హె చ్.ఎస్ నార్లాపూర్, కాటాపూర్ లలో నిర్వహించారు. విద్యార్థు లే ఉపాధ్యాయులై మిగతా విద్యార్థులకు విద్యా బోధనలు చేశారు. అనంంతరం బాధ్యతలు మెరుగుగా నిర్వహించిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అభినందించి బహుమతులు అంద జేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు, తల్లి దండ్రులు, తదితరులు పాల్గొన్నారు.