వర్షాకాలం మొదలైన పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు
– అధికారుల లోపంతో గ్రామంలో పడకేసిన పారిశుధ్యం
తెలంగాణ జ్యోతి, ఖానాపూర్ : వర్షాకాలం మొదలైందంటే కొత్త కొత్త రోగాలు కూడా మొదలైతాయి. గ్రామాలలో పారిశుధ్యం పడకేయగా ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. దోమలు, ఈగలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా గ్రామపంచాయతీ అధికారులు నిద్రపోతున్నారు. బ్లీచింగ్, క్లోరినేషన్, చేయడంలేదు. పారిశుధ్యంపై దృష్టిసారించాల్సిన అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టడంలేదు. ఫలితంగా ఆ ప్రభావం ప్రజల ఆరోగ్యాలపై పడుతోంది. గ్రామీణ పల్లెల్లో మురుగు నీరు రహదారులపై ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్న కూడా పట్టించుకునే వారే కరువయ్యారు. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగు కాలువలు లేక చెత్తాచెదారం, రోడ్లపై పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక పోతున్నారు. దోమలు విజృంభించి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామాల్లో మలేరియా, టై ఫాయిడ్, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రభలు తున్నాయి. వచ్చి పోయే వర్షాలకు నడుమ ఆపరిశుభ్రత వాతావరణం తాండవిస్తోంది. మురుగు కాల్వల్లో బ్లీచింగ్, చల్లేందుకు కనీస చర్యలు తీసుకోవాల్సిన గ్రామ పంచాయితీ అధికారులు యాది మరిచారు పేద ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపని వైద్య అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది . దీనికి తోడు పలు గ్రామాల్లో డ్రైనేజీలను నిర్మించక పోవడంతో ఇళ్లలోని మురుగు నీరు వీధుల్లో ప్రవహిస్తోంది. దీంతో గ్రామాల్లో అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఫలితంగా దోమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని విజృంభిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో నిర్మించిన డ్రైనేజీలో పూడిక తీయ్యకపో వడంతో సమస్య ఏర్పడుతున్నది. ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లో పారిశుధ్య నిర్మూలనా చర్యలు చేపట్టి రోగాల బారిన పడకుండా ప్రజారోగ్యాన్ని పరి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.