ప్రభుత్వ భూములు అన్యక్రాంతానికి గురి కాకుండా కాపాడాలి

ప్రభుత్వ భూములు అన్యక్రాంతానికి గురి కాకుండా కాపాడాలి 

– మినీ స్టేడియాన్ని తలపించేలా క్రీడా ప్రాంగణ అభివృద్ధి చేయాలి. 

– క్రీడా ప్రాంగణ అభివృద్ధికి 30 లక్షల నిధుల మంజూరు. 

– 10 లక్షలతో చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.

– ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఖాళీ ప్రదేశాన్ని సుందరీ కరణ చేయాలి* 

– ఎర్రకుంట చెరువు శిఖం భూమిని చదును చేసి ప్రభుత్వ కార్యలయాల నిర్మాణాలకు సిద్ధం చేయాలి

– ఎన్ ఏ సి బిల్డింగ్ నిర్మాణానికి రెండున్నర ఎకరాల భూమి గుర్తింపు

చదువు మీ భవిష్యత్తు ను నిర్ణహిస్తుంది

– 10 వ తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

 తెలంగాణ జ్యోతి, కాటారం: ప్రభుత్వ భూములు అన్యక్రాంతానికి గురి కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం కాటారం మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని క్రీడా ప్రాంగణాన్నీ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. క్రీడా ప్రాంగణం అభివృద్ధి కి 30 లక్షల నిధులు మంజూరు అయినందున 10 లక్షల వ్యయంతో చుట్టు ఇనుప కంచెను ఏర్పాటు చేసి రూ.20 లక్షలతో మైదానంలో 50 లేదా 60 మంది కూర్చోని క్రీడలను వీక్షించేలా మెట్లు నిర్మాణం చేయాలని కోరారు. అలాగే క్రీడా మైదానంలో ఆయా రకాల క్రీడలను ఆడేందుకు గాను పలు మౌళిక సదుపాయలు కల్పనకు కృషి చేయాలని అన్నారు. క్రీడా సామగ్రి ని భద్రపరిచేందుకు వీలుగా ఒక మినీ బిల్డింగ్ ను నిర్మాణం చేసి సోలార్ లైట్లు మరియు సి సి కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా క్రీడల్లో యువత ఆసక్తి చూపేలా, వాలిబాల్, బాల్ బ్యాట్ మెంటన్, క్రికెట్ క్రీడలకు ప్రాముఖ్యత నిచ్చేలా క్రిడా ప్రాంగణాన్ని నెలకొల్పాలని అంచనా వ్యయాన్ని రూపొందించి, త్వరితగతిన పనులను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఖాళీ ప్రదేశాన్ని పూలు పండ్ల చెట్లతో సుందరీ కరణ చేయలన్నారు. మండల కేంద్రంలోని 5 ఎకరాల విస్తీర్ణంతో ఎర్రకుంట చెరువు శిఖం భూమిని చదును చేసి ఇర్రిగేషన్ శాఖ నుండి ఎన్ ఓ సి తీసుకుని పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం భూమిని వినియోగించుకోవలన్నారు. కాటారం మండలంలోని మద్దులపల్లి గ్రామ శివారులో గల రెండున్నర ఎకరాల ఫారెస్ట్ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, ఎం ఏ సి బిల్డింగ్ నిర్మాణానికి వినియోగించాలని కలెక్టర్ అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి 10 వ తరగతి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, బయో సైన్స్ పాఠాలను బోధించి వచ్చే నెలలో జరిగే 10 వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మెరుగైన ఫలితాలు సాధించి భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు సాయిలు, ఆశోక్, ఎం పి పి సమ్మయ్య, తాశీల్దార్ నాగరాజు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment