పదేండ్ల పాలనలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసింది..?

Written by telangana jyothi

Published on:

పదేండ్ల పాలనలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసింది..?

– అభివృద్ధి గురించి బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉంది

– బి ఆర్ ఎస్ పై నమ్మకం లేకనే ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు

–  కేసీఆర్,హరీష్ రావు,కేటీఆర్ లు మతి భ్రమించి మాట్లాడుతున్నారు

– ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయం

– అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ సభలు నిర్వహించడం హాస్యాస్పదం

– కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు బాదం ప్రవీణ్

ములుగు, తెలంగాణజ్యోతి ప్రతినిధి : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు బాదం ప్రవీణ్ అన్నారు ఈ మేరకు ఆయన గురువారం ములుగులో విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రాష్ట్ర ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, రైతుల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు . ప్రాజెక్టుల పేరుతో అక్రమంగా సంపాదించుకున్న కెసిఆర్ ,హరీష్ రావు ,కేటీఆర్ నేడు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంద న్నారు పదేళ్ల కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ముఖ్యంగా నిరుద్యోగ యువత రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం పై నమ్మకం లేకనే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు అలాంటి తెలంగాణ ప్రజానీకం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని పేర్కొన్నారు . ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పై టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిం చారు. తెలంగాణలో అద్భుతం సృష్టించామని గొప్పలు చెప్పిన సీఎం కేసీ ఆర్కు నేడు మేడిగడ్డ పరిస్థితి కనిపించడం లేదా అని అన్నారు. కట్టెలో కాలేవరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడడం సిగ్గుగా ఉందన్నారు. ప్రజలపై మమకారం ఉంటే ప్రజా సమస్యలపై నిజంగా పోరాటం చేయాలనుకుంటే అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనబడని ప్రజా సమస్యలు అధికారం పోగానే వారికి కనపడుతున్నాయా అని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి కుటుంబ పాలన కొనసాగించిన టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు సరైన సమాధానం చెప్పారని, మళ్ళీ ప్రజల్లో మెప్పు పొందేందుకు ఆ పార్టీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని పేర్కొన్నారు .ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల ను అమలు చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ,అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడు తున్నారని అన్నారు .ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకులు తమ పద్ధతి మార్చుకొని నడుచుకోవాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల చేతుల్లో దెబ్బలు తినక తప్పదని ఆయన హెచ్చరించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now