పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు
– కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జి జాడి రాంబాబు
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: తెలంగాణ ప్రభుత్వం ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వరకు నిర్వహించనున్న పదవతరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులకు కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబాబు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల గురించి విద్యార్థులు ఆందోళన పడొద్దని, మీ జీవితంలో మొదటిసారిగా బోర్డు పరీక్షలకు హాజరవుతున్నందున ఒత్తిడిని జయించి ముందుకు వెళ్లాలన్నారు. పదవతరగతి ప్రతీ విద్యార్థికి మొదటి మెట్టని, ఉత్తమ ఫలిలతాలు సాధించి తల్లిదండ్రులు, గురువులకు పేరు తీసుకురావాలని కోరారు. పరీక్ష రాసేప్పుడు ప్రశ్నాపత్రం చదివి ముందుగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. భవిష్యత్ లో ఉన్నత స్థాయిలో పై చదువులు కోసం వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.