Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

రాష్ట్రస్థాయి కబడ్డీకి గోగు శేషు ఎంపిక

On: December 16, 2025 7:06 PM

రాష్ట్రస్థాయి కబడ్డీకి గోగు శేషు ఎంపిక

మంత్రి సీతక్క చేతుల మీదుగా సన్మానం

ములుగు, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన గోగు శేషు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి దనసరి సీతక్క శేషును శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టేలా క్రీడాకారులు కృషి చేయాలని, వారికి అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ నెల 25 నుంచి 27 వరకు కరీంనగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో శేషు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పైడాకుల అశోక్, అధ్యక్షుడు భూక్య రవీందర్, కార్యదర్శి పోలేపోక జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!