బెస్ట్ బ్లడ్ డోనర్ & మోటివేటర్- 2024 అవార్డు ల ప్రదానం
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ఇంటర్నేషన ల్ వైశ్యస్ ఫెడరేషన్ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో బెస్ట్ బ్లడ్ డోనర్ & మోటివేటర్- 2024 అవార్డు ల ప్రదానం ఫక్షన్ ను హైదరాబాద్ లోని ముషీరాబాద్ వైశ్య హోటల్ లో శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా నుండి ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ సయ్యద్ వహీద్, నూగూరు వెంకటాపురం చేయూత స్వచ్చంద సంస్థ అధ్యక్షులు చిడెం సాయి ప్రకాష్ చేస్తున్న సేవలను గుర్తించి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మరియు ముషీరాబాద్ శాసనసభ్యులు గోపాల్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా రక్తదాతలను సన్మానించి, సర్టిఫికెట్ లను మరియు షీల్డ్స్ ను అందించటం జరిగింది. ఈ కార్యక్రమం లో ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య కేంద్రం అధ్యక్షులు రాష్ట్ర జిల్లా అధ్యక్షులు, మరియు తెలంగాణ రాష్ట్ర నుండీ ఎన్నుకోబడిన స్వచ్చంధ సేవా సంస్థలు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.