వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
– చేపల వేటకు వెళ్ళవద్దు – వెంకటాపురం సి.ఐ. బండారి కుమార్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : పెరుగుతు న్న గోదావరి నీటిమట్టం, భారీ వర్షాల కారణంగా అనేక కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని, ఆయా గ్రామాల ప్రజలు, చేపల వేటకు వెళ్ళవద్దని, వాగులు దాటవద్దని ప్రమాదాల కు గురికా వద్దని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ప్రజలను కోరారు. శనివారం వెంకటాపురం మండల పరిధిలోని తిప్పాపురం పంచాయతీ అటవీ ప్రాంతం లోని పెంకవాగు ఉధృతిని పోలీ సు బృందంతో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటవద్దని, వరద భద్రతాపరమైన అంశాలపై అవగా హన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. కే. తిరుపతి రావు, సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.