పురుగుమందు తాగి బాలిక మృతి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామానికి చెందిన కంపెల్లి సంజన (13) బాలిక మతిస్థిమితం లేక ఈనెల 7వ తేదీన పురుగు మందు తాగింది. వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటం తో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు వెంకటాపురం ఎస్సైకే. తిరుపతిరావు మీడియాకు తెలిపారు