Whatsapp : ఒకే నంబర్ రెండు ఫోన్లలో వాట్సప్ ఎలానో చూడండి ..!
డెస్క్ : చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడే మెసేజింగ్ యాప్ వాట్సప్… మునుపు ఒక నంబర్ తో ఒక ఫోన్లో మాత్రమే వాట్సప్ ను వినియోగించుకోవడం సాధ్యమయ్యేది. ఇప్పుడు లింక్డ్ డివైజ్ ఆప్షన్ ద్వారా వేరే ఫోన్లలోనూ అదే నంబర్ వాడుకోవచ్చు. అది ఎలా ఉపయోగపడుతుంది.? ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూడండి ..?
సాధారణంగా వాట్సప్ వెబ్ కు మన ఫోన్ కనెక్ట్ చేయడం గురిం చి చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. చాలా సింపుల్గా ఆ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. వేరే ఫోను కనెక్ట్ చేయడమనేది కాస్త భిన్నం. ముందుగా మీ ప్రైమరీ ఫోన్లో కుడి వైపు ఉండే త్రీ డాట్స్ మెనూను ఓపెన్ చేసి.. అందులో లింక్డ్ డివైజెస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుం ది. ఇప్పుడు రెండో ఫోన్ తీసుకుని అందులో వాట్సప్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. లాగిన్ అయ్యే సందర్భంలో ఫోన్ నంబర్ ఆప్షన్ అడుగుతుంది. అప్పుడు త్రీడాట్స్ మెనూ ఓపెన్ చేసి అందులో కంపేనియన్ డివైజ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దీంతో ప్రైమరీ ఫోన్ స్కాన్ చేసి లాగిన్ అవ్వాలి. ఆపై రెండు ఫోన్లలోనూ వాట్సప్ వినియోగిం చుకోవచ్చు.
– ఇలా చేయండి…
• ఒకప్పుడు వాట్సప్ వెబ్ వినియోగించాలంటే ప్రైమరీ డివైజ్ నెట్ కనెక్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు ప్రైమరీ డివైజ్లో డేటా ఆఫ్ ఉన్నా రెండో డివైజ్లో సందేశాలు పంపు కోవచ్చు.
• లింక్డ్ డివైజ్ ఆప్షన్ ద్వారా గరిష్ఠంగా నాలుగు డివైజులు మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు.
•యూజర్ ఆండ్రాయిడ్ వాడుతున్న, ఐఓఎస్ వాడుతున్న ఈ ఫీచర్ పనిచేస్తుంది.
•లింక్డ్ డివైజ్లో లో సందేశాలు మాత్రమే పంపుకొనే వీలుంది. కాల్స్ మాట్లాడడం సాధ్యం కాదు. ప్రైమరీ ఫోన్లో మాత్రమే కాల్స్ చేసుకోవచ్చు.
• ఒకవేళ వేరే ఫోన్లో వాట్సప్ అకౌంట్ వద్దనుకుంటే ప్రైమరీ ఫోన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించుకోవచ్చు.