ధాన్య రాశుల వద్ద భారీ మచ్చల పాము
– అప్రమత్తమైన రైతుల చేతిలో హతం
వెంకటాపురం నూగూరు, నవంబర్ 24 (తెలంగాణ జ్యోతి):ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం వద్ద ధాన్యాన్ని ఆరబోసుకుంటూ కాపలా కాస్తున్న రైతులు సోమవారం రాత్రి భారీ పామును గమనించి అప్రమత్తమయ్యారు. నల్లమచ్చలతో, సుమారు ఆరు అడుగులకు పైగా పొడవున్న పాము ధాన్య రాశుల వైపు పాకుతుండగా రైతులు టార్చ్‌లైట్లు వేయగానే పాము వారి వైపు దూసుకొచ్చింది. వెంటనే స్పందించిన రైతులు పామును హతమార్చారు. రైతుల సమాచారం మేరకు ఆ పాము అత్యంత విషపూరితం అయిన తాటి జెర్రీ లేదా కట్లపాముగా భావిస్తున్నారు. ఇలాంటి పాము కాటు పడితే నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.






