కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలి.
– సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్
ములుగు, తెలంగాణ జ్యోతి : దేశ రాజధాని ఢిల్లీలో కనీస మద్దతు ధర కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా సిపిఐ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలన్నారు.గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం కోసం సంవత్సరం జరిగిన పోరాటంలో 1000 మంది రైతులు అమరత్వం చెందారన్నారు. అయినా పోరాటం విడవని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి దేశ రైతాంగానికి క్షమాపణలు చెప్పి చట్టాలను రద్దు చేస్తూ ఒక ఆరు నెలలు సమయం ఇవ్వాలని కోరారున్నారు. ఆనాడు రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు సమ్మె విరమించిన, ఆ కనీస మద్దతు ధర నేటికీ అమలు చేయని సందర్భంలో మళ్లీ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. ఈ నిరంకుశమైన విధానాలతో రైతు ఉద్యమాలపై అణచివేత ప్రదర్శిస్తూ జరిపిన పోరాటంలో మరొక యువరైతు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందన్నారు. అదే కాక మరొక రైతు గుండెపోటుతో మరణించడం జరిగిందని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించా లన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ ఏమాత్రం భేషజాలకు పోకుండా వెంటనే రైతులకు కనీస మద్దతు ధరకు చట్టం తీసుకురావాలని, అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం రైతాంగం సమరశీల ఉద్యమాలకు సిద్ధం అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ముత్యాల రాజు, బండి నరసయ్య, అంజద్ పాష, ఇంజం కొమురయ్య, శ్యాంసుందర్, నటరాజ్, రమేష్, రాకేష్, రైతు సంఘం నాయకులు మహేందర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.