లక్ష్మీదేవిపేట గౌడ సంఘం అధ్యక్షునిగా గట్టు శంకర్ గౌడ్
వెంకటాపూర్, తెలంగాణజ్యోతి :లక్ష్మీదేవిపేట గౌడ సంఘం అధ్యక్షునిగా గట్టు శంకర్ గౌడ్ ఎన్నికయ్యారు. మంగళవారం లక్ష్మీదేవి పేట గ్రామంలో నల్లగుంట, బూరుగుపేట, లక్ష్మీదేవి పేట గ్రామాలకు చెందిన గౌడ కులస్తుల సమక్షంలో ఎన్నికలు జరిగాయి. శంకర్ గౌడ్ వరుసగా రెండవసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా మేరుగు మల్లయ్య, డైరెక్టర్లు గా బుర్ర సదానందం ,బుర్ర అశోక్ వీరగాని రమేష్, మామిండ్ల సంపత్,పెరుమాండ్ల విక్రమ్, కొండ శంకర్, జనగాం రవి, కారు పోతుల చిన్న రాజు, కొండ తిరుపతి, కాసగాని ఓదెలు, చిర్ర హరీష్,చిర్ర గణేష్ ఎన్నికయ్యారు. సమావేశంలో గౌడ సంఘం నాయకులు గట్టు కుమారస్వామి, గట్టు చిన్న రాజయ్య, చిర్ర వీరయ్య రాజు తుఫాన్ రాపర్తి రమేష్, కారుపోతుల యాద గిరి,చర్లపల్లి సతీష్, దొమ్మటి సదయ్య, గట్టు సమ్మయ్య, అంత టి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.