Gattamma | 24న గట్టమ్మ వద్ద షాపుల వేలం
– అత్యధికంగా కొబ్బరికాయలకు రూ.లక్ష దరావతు
ములుగు ప్రతినిధి, డిసెంబర్ 21, తెలంగాణ జ్యోతి : మేడారం మహా జాతరను పురస్కరించుకొని మొదటి మొక్కుల తల్లిగా పేరుగాంచిన గట్టమ్మ తల్లి ఆలయం ద్ద షాపుల నిర్వహణకు ఈనెల 24న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఇన్చార్జి ఈవో శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు, పసుపు కుంకుమ, కూల్ డ్రింక్స్, మక్కజొన్న కంకులు, అమ్మవారి ప్రసాదం, బెల్లం, రెండు హోటళ్లు, రెండు పాన్ షాపులు, పండ్లు, కాఫీ, పల్లికాయలు, బొమ్మలదుకాణం, ఐస్క్రీం, కొబ్బరి బోండాలు, చెరుకు రసం షాపుల విక్రయానికి సీల్ టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఆలయం వద్దే ఉదయం 10గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తామని ఈవో తెలిపారు. ఈ షాపులు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 4వతేదీ వరకు నిర్వహించుకోవచ్చన్నారు. ఈ షాపుల్లో కొబ్బరికాయల షాపుకు రూ.లక్ష, పసుపు కుంకుమ, కూల్ డ్రింక్స్ షాపులకు రూ.50వేలు, మక్కజొన్న కంకులకు రూ.30వేలు, ప్రసాదంకు రూ.20వేలు, మిగిలినవన్నీ 10వేల చొప్పున డీడీలు తీయాల్సి ఉంటుంది. డీడీలను గట్టమ్మ దేవాలయం పేరిట జాతీయ బ్యాంకులో తీయాలని ఈవో తెలిపారు. ఈనెల 22, 23తేదీల్లో టెండర్ ఫారాలు పొంది, వేలం రోజున రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వెంటనే బహిరంగ వేలం నిర్వహిస్తామని వెల్లడించారు.









