ఐలాపురం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు విడుదల చేయాలి
– తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ పోడెం బాబు
కన్నాయిగూడెం, తెలంగాణజ్యోతి: మండలంలోని ఐలాపురం గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ పొడెం బాబు మరియు ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి. అనంతరం వారు మాట్లాడుతూ… ఐలాపూర్ లో జరిగే మహ జాతర సందర్భంగా గుడి వద్ద బోరు పైప్ లైన్స్ లిఫ్టింగ్ ద్వారా గుడి చుట్టూ ప్రాంగణంలో నల్లాలు ఏర్పాటు చేయాలి, గుడి ప్రక్కన విస్తీర్ణం రెండెకరాల వెడల్పు ఏర్పాటు చేయాలని అన్నారు. గుడి దగ్గర ఉన్నటువంటి కరెంటు పోల్స్ ప్రక్కకు తొలగించాలి. అంతే కాకుండా సర్వాయి నుండి సారలమ్మ తల్లిని తీసుకువచ్చే క్రమంలో ఆ దారి సమ్మక్క గుడికి వెళ్లే దారికి సర్వాయి రోడ్డు కలపాలని, సర్వాయి గ్రామంలో కరెంటు ఏర్పాటు చేయాలని, గుడి చుట్టూ ప్రహరీ గోడ జాతర వరకు సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాధికారులు విజయవంతంగా చేయుటకు సహకరించాలని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వన దేవతల సమ్మక్క సారలమ్మ జాతరకు సకాలంలో నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ డైరెక్టర్ శోభన్, తుడుందెబ్బ మండల అధ్యక్షులు గుండ్ల పాపారావు ,కోరల్ సంపత్, పూజారి వాసం లక్ష్మయ్య, వట్టం సాధన రావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.