తాడ్వాయి కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాంపాక అవిలయ్య అధ్యక్షతన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రధమ సంవ త్సర విద్యార్థులకు స్వాగతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి ప్రిన్సిపాల్ రాంపాక అవిల య్య మాట్లాడుతూ అన్ని సమస్యలకు చదువే పరిష్కారమ ని, ప్రపంచంలో చదువు కంటె విలువైన సంపద ఏది లేదని, అందుకే విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. రాబోయే వార్షిక పరీక్షల కొరకు ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేసుకొని చదవాలని పిలుపునిచ్చారు. విద్యార్దులు నృత్యాలతో ఆద్యంతం అలరించారు. ఈకార్యక్ర మంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొమ్మాల సంధ్య, లైబ్రేరియన్ కమలాదేవి, కిషన్, బిక్షం, రాజ్ కుమార్, రాజు, అశోక్, శ్రీలత, నాగరాజు, హరికృష్ణ, దివ్య, లతో పాటు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.