వేసవికి ముందే మార్కెట్లోకి వచ్చిన పేద వాడి ఫ్రీజ్ లు

వేసవికి ముందే మార్కెట్లోకి వచ్చిన పేద వాడి ఫ్రీజ్ లు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : శీతాకాలం లో వేసవి ని తలపిస్తోన్న భగభగ మండే ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఎండలో పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి చల్లటి మంచినీళ్లు కోసం ఆశిస్తూ సేదతీరటం పరిపాటి. అయితే ధనవంతులకే పరిమితమైన విద్యుత్ ఫ్రీజ్లు చల్లటి మంచినీ ళ్లు తాగే ఉన్నత వర్గాలకే పరిమతం అయ్యాయి. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి అందుబాటులో ఉండే ధర లతో ఆకర్షణీయమైన రంగులతో మట్టి కుండలు, నూగూరు వెంకటాపురం మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నారు. చతిస్గడ్ బీజాపూర్ ప్రాంతం నుండి కొంతమంది వ్యాపారులు ప్రత్యేక వాహనంలో 20 లీటర్లు,10 లీటర్లు పట్టే సీ.జి. కుండ లను రూ. వంద నుండి 300 రూపాయల వరకు ఆయా సైజులను బట్టి విక్రయిస్తుండటంతో పలువురు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment