మున్సిపాలిటీ బరిలో మాజీ ఎంపీపీ
– బీసీ మహిళ రిజర్వ్ కావడంతో ప్రజల్లోకి మళ్లీ
ములుగుప్రతినిధి,జనవరి17,తెలంగాణజ్యోతి:ములుగు మున్సిపాలిటీ బరిలో మాజీ ఎంపీపీ బరిలో నిలువనున్నారు. గండ్రకోట శ్రీదేవి, సుధీర్ యాదవ్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపాలిటీ చైర్ పర్సన్ రిజర్వేషన్ బీసీ మహిళగా ఖరారు కావడంతో పాటు 20డివిజన్ల రిజర్వేషన్ సైతం అధికారులు ప్రకటించడంతో ఆశావాహులు ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. మెజారిటీ కౌన్సిలర్లను గెలిపించుకొని చైర్పర్సన్ పీఠం దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసు కుంటున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే తమ అనుచరులతోపాటు అనుకూలంగా ఉండే వారిని గెలిపించు కునేందుకు సమాలోచనలు చేస్తున్నారు. బీసీ బిడ్డగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బీసీలకు ప్రతినిధిగా నిలవాలని శ్రీదేవి సుధీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగుజిల్లా ఉద్యమంలో భాగస్వాములమయ్యామని, ములుగు ఎంపీపీగా ప్రజలకు సేవలందించామని పేర్కొన్నారు. ములుగు జిల్లా, మున్సిపాలిటీ ఏర్పాటు బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం లో జరిగాయన్నారు.






