బి ఆర్ ఎస్ కు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రాజీనామా
– సనాతన ధర్మం వైపు దృష్టిసారించిన కాయిత విఠల్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కాయిత విఠల్ తన పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులకు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. రాజకీయాలకు అతీతంగా తాను సనాతన ధర్మం వైపు దృష్టిసారించి ముందుకు సాగుతు న్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాను కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవికి, భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తాను అనుసరిస్తున్న ఆధ్యాత్మిక ధోరణి నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా నడుచుకోవాలనే ధ్యేయంతో ఉన్నట్లు వివరించారు. రాజకీయాలకు తావు లేకుండా ప్రజలందరూ ఆధ్యాత్మిక భావనతో, ధార్మిక చింతనతో జీవితాన్ని కొనసాగించాలని కాయిత విఠల్ సూచించారు.