జగన్నాధపురం, చెరుకూరు పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎస్ సర్వే
వెంకటాపురం నూగూరు, మార్చి 30, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాధపురం యూపీఎస్, చెరుకూరు ఎంఫిపీఎస్ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్) సర్వే సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడో తరగతి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించి వారి చదువు, అర్థం చేసుకునే స్థాయిని అంచనా వేశారు. సర్వే నిర్వహణ సమయంలో ములుగు జిల్లా ఉల్లాస్ కోఆర్డినేటర్ డా. పీర్ల కృష్ణబాబు పర్యవేక్షించగా, వాజేడు మండల విద్యాధికారి తేజావత్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. డిఈడీ విద్యార్థులు వైష్ణవి, అంజలి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా సర్వే ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యారు. విద్యార్థుల ప్రాథమిక అభ్యాసన స్థాయిని మెరుగుపర్చేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.









