Fastag | ఫిబ్రవరి నుంచి వాహనాలకు కొత్త నిబంధనలు అమలు
డెస్క్ : వాహనదారుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి పలు కీలక నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోతే, ఫాస్టాగ్ రీచార్జ్ సమయంలోనే జరిమానా మొత్తాన్ని ఆటోమేటిక్‌గా కట్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జనవరి 1 నుంచే వాణిజ్య వాహనాల కు ట్రాకింగ్ డివైజ్‌లు తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఇకపై పెండింగ్ చలాన్లు, ఇన్సూరెన్స్ పూర్తిగా క్లియర్ చేసిన వాహనాలకే పర్మిట్లు జారీ చేయనున్నారు. మరోవైపు జాతీయ రహదారులపై నిర్ణీత వేగ పరిమితిని మించి ప్రయాణిస్తే గరిష్టంగా రూ.2 వేల వరకు జరిమానా విధించనున్నా రు. ఈ కొత్త నిబంధనలతో రోడ్డు భద్రత మరింత మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.







