ఫేక్ నెంబర్ ప్లేట్ ఇసుక లారీ పట్టివేత – చీటింగ్ కేసు నమోదు

Written by telangana jyothi

Published on:

ఫేక్ నెంబర్ ప్లేట్ ఇసుక లారీ పట్టివేత – చీటింగ్ కేసు నమోదు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర పంచాయతీ ఒంటి చింతలగూడెం ఇసుక ర్యాంపు నుండి ఒక నెంబర్ గల లారీకి డీ.డీ తీసి మరొక లారీకీ ఫేక్ నెంబర్ ప్లేట్ తగిలించి ఇసుక తరలించుకు పోతుండగా సమాచారం మేరకు వెంకటాపురం పోలీసులు శనివారం రాత్రి వెంకటాపురం శివారు శివాలయం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఫేక్ నెంబర్ ప్లేట్ ఇసుక లారీ పట్టుబడింది. ఈ మేరకు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ వెంకటాపురం ఎస్సై కే. తిరుపతిరావు లు మీడియాకు ఫేక్ నెంబర్ ప్లేట్ ఇసుక లారీ కేసు వివరాలను, ఆదివారం సాయంత్రం మీడియా కు విడుదల చేశారు. పోలీసుల కథనం ప్రకారం టీఎస్ ఓ 8 యు. జి 22 29 లారీకి డిడి తీశారు. ఆ నెంబర్ లారీ కి బదులుగా ఫేక్ నెంబర్ ప్లేట్ తో లారీని లోడ్ చేయించుకొని, తరలించక పోతున్నట్లు టిఎస్ఎండిసి అధికారుల నుండి వెంకటాపురం పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్, ఎస్సై కే. తిరుపతిరావు పోలీస్ సిబ్బంది వెంకటాపురం శివాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఫేక్ నెంబర్ ప్లేట్ తో గల ఇసుక లారీ పట్టుబడింది. టీఎస్ ఓ 6 యు.సి.9189 నెంబర్ గల ఇసుక లారీ నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నేనావత్ సురేష్, పట్లావత్తు శ్రవణ్ అను ఇరువురు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎదిర ఒంటి చింతలగూడెం నుండి ఫేక్ నెంబర్ ప్లేట్ తో ఇసుక లారీ లోడింగ్ చేసుకొని వెంకటాపురం మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నట్లు పోలీస్ లకు సమాచారం అందింది. ఫేక్ నెంబర్ ప్లేట్ గల ఇసుక లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Leave a comment