నార్కోటిక్‌ స్నిఫర్‌ డాగ్‌తో విస్తృత తనిఖీలు

On: November 17, 2025 5:23 PM
నార్కోటిక్‌ స్నిఫర్‌ డాగ్‌తో విస్తృత తనిఖీలు

నార్కోటిక్‌ స్నిఫర్‌ డాగ్‌తో విస్తృత తనిఖీలు

ఏటూరునాగారం, నవంబర్ 17, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రం మార్కెట్‌ ఏరియాలోని కిరాణా దుకాణాలు, పాన్‌ షాపులతో పాటు పలు వ్యాపార స్థావరాల్లో పోలీసు అధికారులు సోమవారం నార్కోటిక్‌ స్నిఫర్‌ డాగ్‌ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్‌.ఐ రాజకుమార్‌, నరేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో, ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు, అలాగే చిన్నపిల్లలకు గుట్కా–సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు విక్రయించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు గోపి, విక్రమ్‌ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment