అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు.
– పట్టుబడ్డ రూ. 2 లక్షల 94 వేలు
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : కాలేశ్వరం అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మహాదేవపూర్ సిఐ రాజేశ్వరరావు ఆధ్వ ర్యంలో కాలేశ్వరం ఎస్సై భవాని సేన తన సిబ్బందితో ఆదివారం ఉదయం ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సిరోంచ నుంచి కాలేశ్వరం వైపు వస్తున్న అంబటిపల్లి కి చెందిన అంజి దగ్గర రూ. 2 లక్షల 94 వేలు నగదును స్వాధీనం చేసుకుని డబ్బును సీజ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ మహా రాష్ట్ర సరిహద్దు ఉండడంతో ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా రాకపోకలు కొనసాగడంతో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ఆటోలు జీపులు కార్లు బస్సుల్లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సివిల్ సీఆర్పీఎస్ పోలీస్ లు ఉన్నారు.
1 thought on “అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు.”