Inter | ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడగింపు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు నవంబర్ 14 వరకు పొడి గించడం జరిగిందని కళాశాల ప్రిన్సి పాల్ కే. విజయ్ కుమార్ ఒక అధికారిక ప్రకటన తెలిపారు.. ఎటువంటి అపరాద రుసుం లేకుండా చెల్లించవచ్చని, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు కె.విజయకుమార్ తెలియజేశారు. కళాశాల విద్యార్థులంతా 75% హాజరు కలిగి ఉండి, పరీక్ష ఫీజును సంబంధిత ఉపన్యాసకులకు కళాశాల పని వేళల్లో చెల్లించాలని ఆయన తెలియజేశారు. అదేవిధంగా నవంబర్ 10 వ తేదీలోగా అర్హులైన విద్యార్థు లంతా ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని కూడా ప్రిన్సిపాల్ తెలిపారు. .
1 thought on “Inter | ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీ పొడగింపు.”