నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సయిజ్ శాఖ దాడులు
కాటారం, డిసెంబర్ 4, తెలంగాణ జ్యోతి : కాటారం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మలహార్ రావు మండలం లోని దుబ్బపేట, అడ్వాలపల్లి, గాదాంపల్లి గ్రామాలలో గురువారం నాటు సారా తయారీ స్థావారాలపై దాడులు నిర్వహించారు. 3 కేసులు నమోదు చేసి 15 లీటర్ల నాటు సారా, 20 కేజీల చక్కరను స్వాధీనం చేసుకుని 700 లీటర్ల చక్కర పానకంను ధ్వంసం చేసినట్లు కాటారం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి. కిష్టయ్య తెలిపారు. నాటు సారాయి తయారు చేసినా, కలిగి వున్నా, రవాణా చేసిన, అమ్మిన చట్టం ప్రకారం కఠిన చర్యలు వుంటాయని తెలిపారు. ఈ దాడులలో హెడ్ కాన్స్టేబుల్ రాంచందర్, కాన్స్టేబుల్ వెంకట రాజు, విమల, పాల్గొన్నారు.






