అంతా రామమయం.. ఈ జగమంతా శ్రీ రామమయం…
వెంకటాపురం నూగూరు, జనవరి 21, తెలంగాణా జ్యోతి ప్రతినిది : శ్రీరామ జన్మభూమి అయోధ్య లో నిర్మాణం పూర్తి అ ఇ న విశ్వవ్యాప్త దివ్య మందిరం లో సోమవారం 22 న అయోధ్యలో శ్రీ భగవాన్ శ్రీ బాల రాముని విగ్రహం ప్రతిష్ట మహోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతుండడంతో జగ మంతా శ్రీ రామ మయం అనే నినాదంతో ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో అనేక దేవాలయాల్లో గృహాలలో, మిర్చి పంట తోట లలో స్వామివారి జెండాలను శ్రీ అభయ ఆంజనేయ స్వామి ప్లెక్సీలను సైతం అలంకరించారు. విశ్వవ్యాప్తంగా భక్తులకు ఎన్నో నెలల క్రితం నుండి అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన నూతన మందిరంలో, శ్రీ బాల రాముని నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం 22వ తేదీన జరగనున్నందు న విశ్వవ్యాప్త శ్రీ రామ భక్తులు జైశ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ శ్రీరామ జన్మభూమి తీర్థయాత్ర క్షేత్ర ఆలయ కమిటీలు భక్త సేవకులు శ్రీరామ భక్తులు ఇంటింటికి గడప,గడపకు శ్రీరామచంద్రుని యొక్క అక్షింతలను కలశాలను శోభాయాత్ర ద్వారా పంపిణీ చేశారు. ఈ మేరకు శ్రీరామ భక్తులు తమ ఇళ్లపై గుమ్మాలలో పందిళ్లకు శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర విశ్వవ్యాప్త శ్రీరామ భక్తులు జై శ్రీరామ్ అనే నినాదాలతో కూడిన కాషాయ జండాలను కట్టి ప్రాణప్రతిష్ట కు భక్తి పారవశ్యం తో స్వాగతం పలికారు. శ్రీరామ జయ రామ, జయ జయ రామ అనే విజయ శ్రీ రామ మహా మంత్రమును ఆలయాల్లో జపిస్తూ, శ్రీరామ భక్తులు గత నాలుగు వారాలు గా శ్రీరామ జన్మభూమి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను శోభాయాత్ర ద్వారా వారి వారి గ్రామాల్లోని దేవాలయాలకు తరలించి, ఇంటింటికి గడప,గడపకు స్వామివారి అక్షింతలు పంపిణీ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ సూచనలు మేరకు గత రెండు రోజులుగా మాంసాహారాల ను నిలిపివేశారు. ఇల్లన్నీ శుభ్రంగా కడుక్కొని, ముత్యాల ముగ్గులతో తీర్చిదిద్దారు. ఆలయాలలో శ్రీరామచంద్రమూర్తి యొక్క జెండాలను ఇళ్లపై అలంకరించారు.అలాగే కొంతమంది రైతులు వెంకటాపురం మండలంలో తమ మిర్చి తోటల వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ స్వామి భక్తిని చాటారు. జై శ్రీరామ జై జై శ్రీరామ శ్రీరామ జయ,రామ జయజయరామ అనే నినాదాల తో ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో గ్రామ గ్రామాన అయోధ్య శ్రీరాముని నామ జపంతో బాల రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కనులారా టీవీలలో వీక్షించి, భక్తిని సాటుకునేందుకు,ఆశేష శ్రీ రామ భక్తకోటి సోమవారం వ్యవసాయ పనులు కూడా మానుకొని, శ్రీరాము ని విశ్వవ్యాప్త రామ భక్తులు ముందు స్తు భక్తి ప్రణాళికలతో, ఏజెన్సీ ప్రాంతాల్లో సిద్ధమయ్యారు.