మేడారం ట్రస్ట్ బోర్డు లో ఆదివాసీలనే నియమించాలి

మేడారం ట్రస్ట్ బోర్డు లో ఆదివాసీలనే నియమించాలి

ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి

వెంకటాపురం నూగూరు జనవరి 21 తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి విలేఖరుతో మాట్లాడుతూ ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర లో ఆదివాసుల ఆరాధ దైవాలు అయినటు వంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర సమీక్షిస్తున్న తరుణంలో ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన దాన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పాత కమిటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు ఏర్పడిన సందర్భంలో మేడారం ట్రస్ట్ బోర్డులో   ఆదివాసీలను కాకుండా గిరిజనేతర డైరెక్టర్లు నియమించడం జరిగింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను మోసం చేయడం జరిగిందని ఆరోపించారు. గిరిజనేతర డైరెక్టర్లకు ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు వాళ్లకు తెలియదని ఆరోపించారు. ఆదివాసి డైరెక్టర్లను ఏర్పాటు చేపిస్తే వాళ్ల సంస్కృతి సంప్రదాయాలు  ఏ చెట్టుకు మొక్కాలి ఏ పుట్టకు మొక్కాలి అనేది ఆదివాసీలకు తెలుసు అని అన్నారు. నూతన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తరుణంలో మేడారం జాతర ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మరియు డైరెక్టర్ లు పూర్తిస్థాయి కమిటీ లో ఆదివాసీల తోటే ఏర్పాటు కావాలనేదే ఆదివాసి ప్రజల డిమాండ్ అని తెలిపారు. ఆదివాసీ లను నియమించని ఎడల ప్రజా పోరాటాలు మొదలు పెడతాం దానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం పునరాలచన చేసి ఆదివాసీలకు ట్రస్టు బోర్డులో మొదటి ప్రాధాన్యత కల్పించాలని ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment