చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ఖానాపూర్, తెలంగాణ జ్యోతి : వన మహోత్సవంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని నర్సంపేట ఎలక్ట్రానిక్, ప్రింట్ పత్రిక విలేకరులు పేర్కొన్నారు. మండల కేంద్రం అశోకనగర్లోని సైనిక్ స్కూల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ తో కలిసి విలేకరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈరోజు చిన్న మొక్కలు కావచ్చు మానవ జీవితానికి మనుగడ అవుతుంది అన్నారు.