రోడ్ డైవర్షన్ ఫ్లెక్సీల ఏర్పాటు
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలోని వాజేడు మండలం లో గోదావరి వరద ఉధృతి పెరగడంతో జాతీయ రహదారిపైకి నీళ్లు వచ్చి రాకపోకలు నిలిచిపోయాయని, ఛత్తీస్ఘడ్, భూపా లపట్నం వైపుం వెళ్లే వారు భూపాలపల్లి మీదుగా వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ములుగు ఎస్సై వెంకటేశ్వర్ రావు ములుగులోని మల్లంపల్లి, జంగాలపల్లి గ్రామాల వద్ద రోడ్ డైవర్షన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి 163పై గోదవరి వరనీరు వచ్చిందని, వాజేడు మండలంలోని ఛత్తీస్ఘడ్ వైపు రాకపోక లు నిలివేసినట్లు కాషన్ ఇచ్చారు. భూపాలపట్నం, చత్తీస్ఘడ్ వైపు వెళ్లేందుకుగాను వాహనదారులు ములుగు మండలం జంగాలపల్లి, వెంకటాపూర్, భూపాలపల్లి జిల్లా గణపురం, భూపాలపల్లి, కాటారం, కాళేశ్వరం మీదుగా ఛత్తీస్ఘడ్ వెళ్లాలని సూచించారు.