Elections |  మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించండి.

Written by telangana jyothi

Published on:

Elections |  మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించండి.

  • డబ్బులతో వాళ్ళున్నారు.. పేదింటి బిడ్డగా నేనున్నాను
  • తండ్రీ ప్రభాకర్, తండ్రి సమానులైన సీఎం కేసీఆర్ ఎల్లవేళలా ఆశీస్సులు
  • నా బలం,బలగం అంతా మీరే.
  •  ఒకసారి అవకాశం ఇవ్వండి ములుగును అభివృద్ధి చేస్తా. 
  • నియోజకవర్గ అభివృద్దే నా ప్రధాన ఆశయం.
  • అభివృద్ధి జరగాలంటే ఎవరు కావాలో ప్రజలు ఆలోచించుకొండి.
  • బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బడే నాగజ్యోతి.

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నానని, తనను ఆదరించి ఆశీర్వదించాలని ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ఈ మేరకు శుక్రవారం నామినేషన్ చివరి రోజున జిల్లా ఇంచార్జి మంత్రి సత్యవతి రాథోడ్,జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు,గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, జెడ్పీటిసి భవాని లతో కలిసి బడే నాగ జ్యోతి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి అంకిత్ కు అందించారు. ఈ సందర్భంగా ముందుగా గట్టమ్మ తల్లికి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ,మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ డబ్బుల ముఠాతో వాళ్ళున్నారని,పేదింటి బిడ్డగా తానున్నానని అన్నారు.తనకు ఆస్తులు ,పాస్తులు ఏమి లేవని,తన బలం ,బలగం అంతా ప్రజలేనని అన్నారు.తన తండ్రీ ప్రభాకర్, తండ్రి సమానులైన సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఎల్లవేళలా తనకు ఉంటాయని అన్నారు.ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కు 10 సంవత్సరాల అధికారం ఇచ్చిన ములుగు కు ఏం చేసిందనీ ప్రశ్నించారు.ఇన్ని ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా ,మరో సారి గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తనకు ఎలాంటి ఆస్తులు లేవని,కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదని బావోద్వేగానికి గురయ్యారు.తనకు ఒక్క సారి అవకాశం ఇస్తే ,ములుగు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.తనకు ఎలాంటి ఎజెండా లేదని,నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన ఎజెండా అని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఎవరు కావాలో ప్రజలు ఆలోచించు కోవాలని ప్రజలకు సూచించారు.

  • కేసీఆర్ వదిలిన బాణమే బడే నాగజ్యోతి.
  • గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ .

ములుగు నియోజక వర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ వదిలిన బాణమే బడే నాగజ్యోతి అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడ ఉన్న వారి మనసు ములుగు పైనే ఉంటుందని అన్నారు. అదే మనసుతో ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారని తెలిపారు.తాము ఢిల్లీ నుంచి రాలేదని, ఇక్కడి నుంచి వచ్చిన బిడ్డలమేనని, నోటుకు, ఓటు కేసులో జైలుకు పోయి నీతులు వల్లించడం రేవంత్ కే చెందుతుందని అన్నారు.చావు నోట్లో తలకాయను పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు కేసీఆర్ అని అన్నారు.మేమే లోకల్ అని ఢిల్లీ నుంచి వచ్చినల్లే నాన్ లోకల్ అని ఆన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తున్నారనీ అన్నారు.తండాలను, గూడాలను గ్రామపంచాయతీలు చేసుకున్నామని, 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంచుకున్నామని, పోడు భూములకు పట్టాలు అందించి, మారుమూల ప్రాంతాల్లో సైతం బీటీ రోడ్లు వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం అభివృద్ధి చేసిందో చర్చకు వచ్చే దౌర్యం ఉందా అని సవాల్ విసిరారు.ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చి, బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

  •  గులాబీమాయమైన ములుగు.

బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి గా బడే నాగజ్యోతి నామినేషన్ దాఖలు చేయగా ,పార్టీ నాయకులు, కార్యకర్తలతో ములుగు జిల్లా కేంద్రం గులాబీ మయంగా మారింది.పార్టీ శ్రేణులు , అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో జిల్లా కేంద్రం కిక్కిరిసి పోయింది. ఎటూ చూసినా బీఆర్ఎస్ కార్యకర్తలతో జిల్లా కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థిని ఆశీర్వదించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, రాష్ట్ర రహదారుల భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీను, మండలాల ఇన్చార్జ్ సమ్మరావు, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఒడిసి ఎమ్ ఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ములుగు ఎంపీపీ శ్రీదేవి, వాణిశ్రీ, బీఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now