అంబెడ్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : గ్రామ ప్రజలు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం కన్నాయిగూడెం మండలం లోని గుర్రెవుల హరిజన కాలనీలో అంబెడ్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు.నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా అంబాల ప్రశాంత్,సంఘం అధ్యక్షుడిగా వాసంపల్లి నరేందర్, ఉపాధ్యక్షుడిగా వాసంపల్లి శివకుమార్, అధికార ప్రతినిధి వాసంపల్లి రాకేష్, ప్రధాన కార్యదర్శి వాసంపల్లి నితిన్,కోశాధికారి వాసంపల్లి ప్రశాంత్, కార్యదర్శి వాసంపల్లి జలందర్, ప్రచార కార్యదర్శి వాసంపల్లి రాంచరణ్, సలహదారులుగా వాసంపల్లి నరేష్ లనుఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం మాట్లాడుతూ… గుర్రెవుల ఎస్సి కాలనీలో అభివృద్ధిలో అంబెడ్కర్ యువజన సంఘం కృషి ఎనలేనిదని అన్నారు. అంబెడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని, అందుకు గ్రామ ప్రజలు, యువకులు, పెద్దలు సంఘ సభ్యులకు సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దలు యువకులు పాల్గొన్నారు.