తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులో కేంద్రం మొండి చేయి

Written by telangana jyothi

Published on:

తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులో కేంద్రం మొండి చేయి

– నిరసన వ్యక్తం చేయాలని సిపిఐ పార్టీ శ్రేణులకు పిలుపు. 

– సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : కేంద్ర ప్రభు త్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంకు నిధులు కేటాయించకుండా రాజకీయ పక్షపాతంతో అభివృద్ధి పథకాలకు అడ్డుపడిందని, కేంద్ర ప్రభుత్వ వైఖరికీ నిరసనగా ములుగు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, ములుగు జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి తోట మల్లికార్జునరావు తెలిపారు. బుధవారం వెంకటాపురంలో ఈ మేరకు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కూటమి లో ఉన్న రాష్ట్రాలకు పెద్దపీట వేసి, తెలంగాణకు నిధులు కేటాయించకుండా బడ్జెట్లో అన్యాయం చేశారని, తెలంగాణ రాష్ట్రంలో ఆధిక సీట్లు బిజెపికి వచ్చిన ,రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని అన్నారు. అలాగే రాష్ట్రానికి చెందిన వారు ఇద్దరు కేంద్ర మంత్రులుగా పదవుల్లో ఉన్నారని, పార్లమెంట్ సభ్యులు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారని, తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగా ణకు చేసిన అన్యాయాలపై భారత కమ్యూనిస్టు పార్టీ సి.పి.ఐ పార్టీ శ్రేణులు అనుబంధ సంఘాలు, దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను, నిరసనలను చేపట్టనున్నట్లు జిల్లా సిపిఐ కార్యదర్శి తోట మల్లికార్జునరావు తెలిపారు.

Leave a comment