ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తణిఖి
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, డిప్యూటీ డిఎంహెచ్ఓ క్రాంతి కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్ కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంటి నెంట్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నటు వంటి స్థానిక పూనేమ్ రమణమ్మ ఇటివల అనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఆమె కుటుంభానికీడి ఎం అండ్ హెచ్ ఓ వైద్య సిబ్బందితో కలిసి వారి కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యాన్ని అందించారు. వారి ఆర్థిక పరిస్థతులను ననుసరించి, మానవతా దృక్పథంతో మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో తమ వంతు సాయంగా మరియు వైద్య శాఖ ఉద్యోగులు ఆర్థికంగా సహాయం చేసిన మొత్తం వారికి 30 వేలు, ట్రీట్మెంట్ సమయంలో 50,000 వెల నగదు/ వారి కుటుంబానికి అందజేశారు. తదనంతరము జిల్లా అదికారి వైద్య సిబ్బందితో గ్రామంలో పర్యటించి, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఇంటి పరిసరాల పరిశుభ్రతను శుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, వంటి వ్యాధులు రాకుండా దోమ తెరలు వాడాలని గ్రామస్తులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ భవ్య శ్రీ, పిహెచ్ఎన్ యాకలక్ష్మి ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
1 thought on “ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తణిఖి”