పలు కార్యక్రమాలకు హాజరైన దుద్దిళ్ల శ్రీనుబాబు
తెలంగాణ జ్యోతి, కాటారం : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహోదరుడు, దుద్దిళ్ళ శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీనుబాబు మంగళవారం కాటారం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భం గా పలు గ్రామాలలో పలువురిని పరామర్శించారు. కాటారం మండలములోని ధన్వాడ గ్రామములో యూత్ కాంగ్రెస్ నాయకులు చీటురి మహేష్ గౌడ్ కుమారుడు శ్రీమాన్ష్ గౌడ్ నీ ఆశీర్వదించి, మొదటి జన్మదిన వేడుకల్లో దుద్దిల్ల శ్రీను బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు. కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామ శాఖ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొనగిరి శ్రీకాంత్ కుమారుని బారసాల కార్యక్రమం లో దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. గారెపల్లి లో తోట సమ్మయ్య అనారోగ్యంతో మృతిచెందగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, దుద్దిల్ల శ్రీనుబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గారేపల్లి లో గంట సమత మృతిచెందగా వారి కుటుంబాన్ని దుద్దిళ్ళ శ్రీను బాబు పరామర్శించారు. బయ్యారం లో రాoభాయ్ మృతిచెందగా వారి కుటుంబాన్ని దుద్దిళ్ళ శ్రీను బాబు పరామర్శించారు. ఆయన వెంట కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డివిజన్ యూత్ అధ్యక్షులు ఎర్రవెల్లి విలాసరావు, మండల యూత్ అధ్యక్షులు చీమల సందీప్, ఓబిసి సెల్ అధ్యక్షులు కొట్టే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.