జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డ్రగ్ ఇన్స్పెక్టర్

Written by telangana jyothi

Published on:

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డ్రగ్ ఇన్స్పెక్టర్

ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని భూపాలపల్లి, ములుగు జిల్లాల డ్రగ్ ఇన్స్పెక్టర్ జె.కిరణ్ కుమార్ మంగళవారం సందర్శించారు. జిల్లా ఆసుపత్రికి నార్కోటిక్ డ్రగ్ లైసెన్సు జారీకై అన్ని వసతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఫార్మసీ మెయిన్ స్టోర్, సబ్ స్టోర్, బ్లడ్ బ్యాంకుల రిజిస్టర్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డా. పి.జగదీశ్వర్, ఫార్మసిస్ట్ సమ్ములు, బ్లడ్ బ్యాంక్ ఎల్ టి కృష్ణ, విజయ్, కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు.

Leave a comment