అధైర్యపడద్దు.. అండగా ఉంటాం…
– ఓటమి గెలుపుకు పునాది అనుకోవాలి
– మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాటారం, డిసెంబర్ 24, తెలంగాణ జ్యోతి : ప్రజాతీర్పును గౌరవించి ప్రజలకు అందుబాటులో ఉండాలే కానీ మనోధైర్యం కోల్పోవద్దని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. బుధవారం సాయంత్రం మహదేవ్‌ఫూర్ మండల కేంద్రంలోని కేదారి గీత నివాసంలో నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని ఏదో కోల్పోయామనే భావన ఉండవద్దని, ఓటమి గెలుపుకు పునాది అని ఆయన తెలిపారు. .స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్త, నాయకుడు సైనికుల్లా పనిచేశారని ఆయన కొనియాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయడంలో బాగస్వాములం కావాలన్నారు. ప్రజల గుండెల్లో గులాబీ జెండా చెరగని ముద్రలా ఉంటుందని, పరిస్థితుల కారణంగా ప్రజాతీర్పు మారుతుందన్నారు. అధైర్యపడవద్దని బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడు మనకు అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.







