రోడ్లపై దాన్యం ఆరబోయవద్దు
– తాడ్వాయి పోలీసుల హెచ్చరిక
తాడ్వాయి, తెలంగాణజ్యోతి : తాడ్వాయి మండలం గ్రామా ల ప్రజలు రహదారులపై ధాన్యం ఆరబోయే వద్దని పోలీసులు వాట్సాప్ గ్రూపుల ద్వారా గురువారం హెచ్చరిక చేశారు. రైతు లు పండించిన వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడం వలన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఎవరైనా ఆర బోసిన ప్రాంతంలో ప్రమాదాలు జరిగితే వెంటనే ధాన్యం ఆర బోసిన వ్యక్తులపై కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగు తుందన్నారు. పోలీసుల ఆదేశాలను అనుసరించి ప్రయాణికు లకు ఇబ్బందులు కలవకుండా రోడ్లపై ఎవరు ధాన్యం ఆరబో యకూడదని సూచించారు.