ఆదర్శలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
– స్వయంపాలన, ఫ్యాషన్ పరేడ్ తో అలరించిన విద్యార్థులు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాల యంలో బాలల దినోత్సవ వేడుకలు విద్యార్థుల ఆనందోత్సా హాల మధ్య గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రు చిత్ర పాటానికి స్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ కార్తీక్ రావులు పూలమాల వేసి నివాళులర్పించారు.పాఠశాలలో విద్యార్థులే టీచర్ల మాది రి స్వయంపాలన చేసి చిన్నారులకు పాఠాలను బోధించారు. అనంతరం విద్యార్థుల ఫ్యాషన్ పరేడ్, సాంస్కృతిక కార్యక్ర మాలు అందరినీ అకట్టుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృషిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.