స్వయంకృషి సేవా సంస్థ ఆధ్వర్యంలో ధన్వాడ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

Written by telangana jyothi

Published on:

స్వయంకృషి సేవా సంస్థ ఆధ్వర్యంలో ధన్వాడ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: స్వయంకృషి సేవా సంస్థ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్, పరీక్ష ప్యాడ్లు లను శంకరంపల్లి వాసి డాక్టర్ అంగజాల కిషోర్ సహకార ముతో అందచేశారు. ఈ కార్యక్రమములో సభాధ్యక్షులు పాఠ శాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, స్వయంకృషి ఫౌండర్ కొట్టే సతీష్, శంకరపల్లి మాజీ సర్పంచ్ అంగజాల అశోక్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు గా విద్యార్థులు పట్టుదలతో చదివి మీ తల్లిదండ్రులకు చదువు నేర్పిన గురువులకు జన్మనిచ్చిన ప్రాంతానికి గొప్ప పేరు తీసుకు రావాలని అన్నారు. విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలు అని, దేశాభివృద్ధిలో భాగ్యస్వామ్యం కావాలని, విద్యార్థులు అన్ని అవకాశాలను వినియోగించుకొని ఉన్నత శిఖరాలను అందు కోవాలని సూచించారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 10వ తరగతి వార్షిక పరీక్షల సమీపిస్తున్న సమయంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇస్తున్నామని, వాటిని సరిగా వినియోగించుకుని మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో గ్రామస్తులు కొండ్రు శివ , బోడ శ్రీధర్ , చిటురి రాజేష్ , గొనె మహేష్, రాజునాయక్, రెడ్డిపల్లి రవి, విడిదినేని ప్రభుదేవా, ఆకుల చంటి, పాఠశాల సిబ్బంది, స్వయంకృషి సభ్యులు హైమద్, శేఖర్, రవి, రాజశేఖర్ పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now