కొత్తూరు గ్రామంలో ఎంపిక చేసిన రైతులకు విత్తనాల పంపిణీ
ములుగు, జనవరి 23 (తెలంగాణ జ్యోతి): కొత్తూరు–కన్నాయిగూడెం, సర్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎంపిక చేసిన రైతులకు శుక్రవారం కొత్తూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో విత్తనాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టి సుదర్శన్ చేతుల మీదుగా రైతులకు విత్తనాలు అందజేశారు. ఏటీఎం మోడల్లో ఉన్న విత్తనాలను మూడు గ్రామాల రైతులకు పంపిణీ చేసినందుకు బాపూజీ రూరల్ డెవలప్మెంట్ సొసైటీకి సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విత్తనాలతో మంచి పంటలు పండించి రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సొసైటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి. మనోహర్ రావు, నూనావత్ స్వర్ణలత పాల్గొన్నారు. విలువైన విత్తనాల పంపిణీపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.






