క్రికెట్ టోర్నమెంట్ విద్యార్థులకు బహుమతుల పంపిణీ
కాటారం ,జనవరి 16, (తెలంగాణ జ్యోతి) : భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చిదనేపల్లి, ప్రతాపగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ప్రథమ బహుమతి ప్రతాపగిరి డేంజర్11 గెలిచి 15 వేలు,షీల్డ్. ద్వితీయ బహుమతి దంతేలపల్లి 5 వేలు,తృతీయ బహుమతి శ్రీనివాప్ పల్లి రూ 2500 ఊర నంద కిషోర్ బాబు బహుమతులు పంపిణీ చేశారు. సర్పంచ్ లు ఊర వెంకటేశ్వర్ రావు, బాల్నే.జగదీశ్వర్ రెడ్డి,5 గ్రామాల క్రీడాకారులు గ్రామపెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో ఊర నంద కిషోర్ ఆధ్వర్యములో 9 తేదీ నుండి తేదీ 15 వరకు టోర్నమెంట్ నిర్వహించారు. ఫైనల్ లీగ్ దంతెలపల్లి – డేంజర్11 ప్రతాపగిరి క్రికెట్ జట్ల మధ్య జరిగింది. క్రికెట్ టోర్నమెంట్లో 6 బొప్పారం వారియర్స్,శ్రీనివాస్ పల్లి, దంతాలపల్లిరియాన్సీ, 11మర్రిపల్లి, డేంజర్11 ప్రతాపగిరి,మొనార్క్ టీమ్ మర్రిపల్లి జట్లు పాల్గొన్నాయి






