ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

– పేదల వైద్యానికి ప్రభుత్వ అండదండలు.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం అతిధి గ్రుహం ఆవరణలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద పది మందికి చెక్కుల పంపిణీ చేశారు. పేదల వైద్యానికి ప్రభుత్వం ఎల్లవేళల అండదండగా ఉంటుందని, వివిధ వైద్యశాలలలో చికిత్సలు పొందిన వారికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద పదిమందికి చెక్కులు పంపిణీ చేసి నట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిఎసిఎస్ అధ్యక్షులు చిఢెం మోహన్ రావు అన్నారు. మొత్తం 8. 50 లక్షలు నిధులు, పదిమందికి పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు , మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టెం సాయి, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాధన పెళ్లి శ్రీనివాసరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీరాముల రమేష్, మద్దూ కూరి ప్రసాద్, ఇంకా పలువురు కార్యకర్తలు, నాయకులు లబ్ధిదారులు, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment