శిధిలావస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయాలి
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలలోని చిన్న బోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శిధిలావస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయాలని కార్యదర్శి కావేరి కృష్ణారావు నోటీ సులు అందించారు. ఇటీ వల కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలో భాగంగా చిన్న బోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హనుమాన్ నగర్ వెంకటాపురం చింతలమూరి రాయబంధం, పెద్ద వెంక టాపురం గ్రామాలలో శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తు న్న ప్రజలను ఖాళీ చేయాలన్నారు. ఆయన వెంట గ్రామ కార్యాలయ కారోబార్ రాజేశం, సిబ్బంది ఉన్నారు.