Dharani | 4 రోజుల పాటు ధరణి సేవలు నిలిపివేత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి సేవలు నిలిచి పోనున్నాయి. డేటా బేస్ వర్షన్ అప్గ్రేడ్ చేయనున్న నేపథ్యంలో ధరణి సేవలను తాత్కాలికం గా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి అప్డేషన్ ప్రక్రియ ప్రారంభమై 16వ తేదీ సోమవారం ఉదయానికి ఈ అప్గ్రేడేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈ మధ్యకాలంలో ధరణి సేవలు అందు బాటులో ఉండవని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు రోజుల నుంచే ధరణి సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి ధరణి ఓటీపీలు కూడా రావడం లేదని మీ సేవా నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.