మేడారంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సమీక్ష నిర్వహించనున్న మంత్రులు
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
ములుగు ప్రతినిధి, జనవరి 10, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మల చెంతకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం రానున్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు మేడారం చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30గంటలకు మేడారం చేరుకోనున్న మంత్రులు తల్లుల దర్శనం అనంతరం అధికారు లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గద్దెల విస్తరణ పనులు ముగుస్తుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 18నy మేడారంలో బసచేసి 19న తల్లులను దర్శించుకొని పున:ప్రారంభించనుండగా ఆదివారం ఉప ముఖ్య మంత్రితోపాటు మంత్రుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఏర్పాట్లు చేపడుతుంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ భద్రతాపరమైన అంశాలను సమీక్షిస్తున్నారు.






