ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన కూలింగ్ టవర్ల కూల్చివేత

ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన కూలింగ్ టవర్ల కూల్చివేత

ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన కూలింగ్ టవర్ల కూల్చివేత

డెస్క్ : దేశంలోనే అతి ఎత్తైన కూలింగ్ టవర్లను తెలంగాణ జెన్ కో అధికారులు ఇంప్లోషన్ టెక్నాలజీ సహాయంతో కూల్చివేశారు. ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ టవర్లను కూల్చివేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని 1960వ దశాబ్దంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 1966-67 ప్రాంతంలో నాలుగు కూలింగ్ టవర్లను నిర్మించిన అధికారులు 1974- 1978 లలో మరో నాలుగు టవర్లను నిర్మించారు. 102 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ టవర్లు దేశంలోనే అతి ఎత్తైనవిగా రికార్డుకెక్కాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించిన థర్మల్ యూనిట్లను మూసి వేయడంతో నిరుపయోగంగా ఉన్న 8 కూలింగ్ టవర్లను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. జపాన్ టెక్నాలజితో అప్పటి అధికారులు ఈ టవర్లను నిర్మించినట్టుగా జెన్ కో అధి కారులు తెలిపారు. సోమవారం ఉదయం నియంత్రిత ఇంప్లో షన్ టెక్నాలజీ ద్వారా రాజస్థాన్ కు చెందిన నిపుణుల పర్య వేక్షణలో కూల్చివేశారు. దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రా లలో నిర్మించిన టవర్లన్నింటికన్న అతి ఎత్తైన టవర్లు పాల్వం చ కేటీపీఎస్లో నిర్మించినవేనని అధికార వర్గాలు చెప్తున్నాయి.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment