దుమ్ముగూడెం గోదావరిలో మృతదేహం లభ్యం
వెంకటాపురంనూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం తానిపర్తి గ్రామానికి చెందిన బానారి రాజు అనే మత్యకారుడు ఈనెల 18వ తేదీన సమీపంలోని గోదావరి నదికి చేపల వేటకి వెళ్లి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ మేరకు వెంకటాపురం పోలీసులు కేసు నమోదు చేసి, మరపడవల ద్వారా నదిలో వెతికించారు. గోదావరి వరద వేగంగా పెరుగుతుండడంతో పాటు భారీ వర్షాలు కారణంగా గల్లంతైన రాజు ఆచూకీ తెలియరాలేదు. కాగా శనివారం ఉదయం ఆలుబాకకు 50 కిలోమీటర్ల దూరంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి, బైరాగుల పాడు గ్రామాల మధ్య గుర్తుతెలియని పురుషుని మృతదేహం లభ్యమైనట్లు ఆలు బాక కు సమాచారం అందింది. దీంతో బంధువులు శనివారం ఉదయం మృతదేహాన్ని దుస్తులు ఆదారం గా గుర్తు పట్టేందుకు దుమ్ముగూడెం మండలానికి బయలుదేరి వెళ్లారు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.