చేపల వేటకు గోదావరికి వెళ్లి మత్స్యకారుడు గల్లంతు
– మరపడవల ద్వారా గాలింపు
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ఆలుబాక పంచాయతీ తానిపర్తి గ్రామానికి చెందిన బాణారి రాజు 40 సం..అనే మత్స్యకారుడు గురువారం సాయంత్రం గోదావరి నదికి చేపల వేటకు వెళ్లి ప్రవాహంలో గల్లంతయ్యారు.ఈ మేరకు గల్లంతైన బానారి రాజు కుమారుడు బానారి సాయిరాం, వెంకటాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరిలో మరపడ వల ద్వారా గోదావరి నదిలో గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలిపారు. కాగా గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పాటు, భారీ వర్షాలు కారణంగా గాలింపు చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లు సమాచారం. భారీ వర్షాలు గోదావరి వరదల కారణంగా అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ శాఖ ఈ సందర్భంగా మండల ప్రజలకు, వరదల సమయంలో చేపలవేటకు వెళ్ళవద్దని ,వాగులు దాటి వెళ్ళవద్దని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.