రేపు మేడారంలో దర్శనాలు బంద్

On: December 23, 2025 12:34 PM

రేపు మేడారంలో దర్శనాలు బంద్

రేపు మేడారంలో దర్శనాలు బంద్

మేడారం, డిసెంబర్ 24 (తెలంగాణ జ్యోతి): మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయంలో బుధవారం (24) న దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. మంగళవారం గద్దెల ఆవరణలో ఆయన మాట్లాడుతూ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్ఠాపన కార్యక్రమాలుతో పాటు గద్దెల విస్తరణ పనులు కొనసాగుతున్నందున, భక్తుల భద్రత దృష్ట్యా ఒక్కరోజు అమ్మవార్ల దర్శనాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!